Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమిళనాడు వీసీకే పార్టీ ఎమ్మెల్యే, ఫ్లోర్ లీడర్ సింతనై సెల్వన్
- దళితబంధు, పల్లె ప్రగతి, హరితహారం పనులను పరిశీలించిన తమిళనాడు బృందం
నవతెలంగాణ - హుజూరాబాద్/ జమ్మికుంట/ వీణవంక
దళితుల ఆర్థిక వృద్ధికి అమలు చేస్తున్న దళితబంధు పథకం భేష్ అని, దళితుల జీవన ప్రమాణాల్లో మార్పులు ఏర్పడుతున్నాయని తమిళనాడు కట్టుమర్నాకోల్ నియోజకవర్గం ఎమ్మెల్యే, వీసీకే(విధుతలై చిరుతైగల్ కచ్చి) పార్టీ ఫ్లోర్ లీడర్ సింతనై సెల్వన్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు, పల్లెప్రగతి పనులను తమిళనాడు బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా సింతనై సెల్వన్ మాట్లాడుతూ.. దళితబంధు పథకం వినూ త్నమైన పథకం అన్నారు. ఎస్సీ సామాజిక తరగతిని ఆర్థికంగా బలోపేతం చేస్తూ, వారిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేలా ప్రవేశపెట్టిన ఈ పథకం జాతీయ స్థాయిలో మొదటిదని చెప్పారు. నిన్నటి వరకు కూలీలుగా ఉన్నవారిని ఇప్పుడు యజమా నులుగా తీర్చిదిద్ది, వారు ఆర్థిక సాధికా రతను సాధించే దిశగా గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టి, పేద దళితుల అభ్యున్న తికి కృషిచేస్తున్న తెలంగాణ ముఖ్యమంతి కేసీఆర్‌ను మరో ఎంజీఆర్ అని అభివర్ణించారు. దళితబందు పథకం అన్నిరాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. తమ పర్యటన అనం తరం తెలంగాణలో ప్రవేశపె డుతున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను తమిళ నాడులో కూడా ప్రవే శపెట్టేలా తమ ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌కు వివరి స్తామని చెప్పారు. ఈ సందర్భంగా హుజూరాబాద్, కనుకుల గిద్ద, జమ్మికుం టలో దళితబంధు పథకం కింద నిలకొల్పిన పలు యూనిట్లను పరిశీలించి, లబ్ది దారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనం తరం కనుకులగిద్ద గ్రామంలోని పల్లెప్రకృతి వనం, శ్మశానవాటిక, రైతువేదిక, గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని బృంద సభ్యులు పరిశీలించారు. ఈ పర్యటనలో తిరుప్పూర్ ఎమ్మెల్యే ఎస్ఎస్ బాలాజీ, చెన్నరు ఎగ్జి క్యూటివ్ డైరెక్టర్ రిచర్డ్ దేవదాస్, సాసీ(ఎస్ఏఎస్ఐ) త్రివేండ్రం రాష్ట్ర కోఆర్డినేటర్ మురుగప్పన్, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డాక్టర్ విఎ.రమేష్ నాథన్, సోషల్ వాచ్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మెన్ బండ శ్రీనివాస్, ట్రైనీ కలెక్టర్ లెనిన్వాత్సల్ టోప్పో, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ అధికారి నాగార్జున, అధికారులు ఉన్నారు.