Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్కింగ్, గ్రీనరీ, వెండింగ్ జోన్స్, సైక్లింగ్ ట్రాక్‌లు
- రూ.56.82కోట్లతో 29 కారిడార్లు
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా జీహెచ్ఎంసీ.. 29 మోడల్ రోడ్డు కారిడార్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ కారిడార్‌లో స్థల ప్రభావాన్ని బట్టి ప్రజల అవసరాల మేరకు వెండింగ్ జోన్లు, గ్రీనరి, పార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ నగరంలో పరిశ్రమల స్థాపనకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. పెట్టుబడిదారులను ఆహ్వానించి పరిశ్రమల స్థాపనకు సులభతరంగా సింగిల్ విండో ద్వారా అనుమతులు మంజూరు చేస్తున్న నేపథ్యంలో ప్రపంచ స్థాయి పరిశ్రమలు హైదరాబాద్‌లో నెలకొల్పు తున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో ప్రతి సంవత్సరం లక్షలాది ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారు. ఈ క్రమంలోగ్రేటర్ హైదరాబాద్ నగరంతోపాటు చుట్టూ ఉన్న ప్రాంతాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. గ్రేటర్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత జీహెచ్ఎంసీకి పెరిగింది.
రోడ్ల అభివృద్ధిపై దృష్టి
గ్రేటర్ ప్రజల కోసం రవాణాను మెరుగుపరచడంపై అధికారులు దృష్టిసారించారు. సిగల్ ఫ్రీ నగరంగా ఉండేందుకు ఎస్ఆర్డీపీ ద్వారా ఫ్లైఓవర్లు, ఆర్ఓబీలు, అండర్‌పాస్‌లు, గ్రేడ్ సపరేట్ కారిడార్ల ద్వారా వాహనదారులు సకాలంలో గమ్యస్థానానికి చేరడానికి ఉపయోగపడతాయి.
దానికి తోడు ఇంధన వినియోగం, కాలుష్య నివారణకు చర్యలు చేపట్టారు. సీఆర్ఎంపీ ద్వారా సుమారు 800 కిలోమీటర్లకు పైగా చేపట్టారు. ప్రత్యేక మోడల్ రోడ్ల కారిడార్ల నిర్మాణాలు జీహెచ్ఎంసీ చేపట్టింది. 150 నుంచి 200 అడుగుల వెడల్పు గల ప్రాంతాల్లో ఈ మోడల్ కారిడార్ రోడ్లను చేపడుతున్నారు. రూ.56.82 కోట్ల అంచనాతో మోడల్ కారిడార్లను 21,535 మీటర్లు చేపట్టారు.
మోడల్ కారిడార్లు ఇలా..
మోడల్ కారిడార్లలో స్థల స్థానిక అవసరాలను బట్టి వెండింగ్ జోన్, సర్వీస్ రోడ్డు, పార్కింగ్, పాదచారుల సౌకర్యం కోసం, గ్రీనరీ పనులు చేపట్ట నున్నారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి కొన్ని కారిడార్ పనులను ప్రారం భించారు. అన్ని విధాలుగా అందరికీ ఉపయోగపడే అవకాశం ఉన్న రోడ్డుకు ఇరువైపులా మోడల్ కారిడార్లను చేపట్టనున్నారు. హబ్సిగూడ నుంచి నాగోల్, ఎల్బీనగర్ మీదుగా ఓవైసీ చౌరస్తా వరకు అక్కడి నుంచి అరాంఘర్ వరకు, ఎన్ఎండీసీ నుంచి షేక్‌పేట్ మీదుగా గచ్చిబౌలి వరకు ఇరువైపులా మోడల్ కారిడార్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. 150 అడుగుల నుంచి 200 అడుగుల వరకు వెడల్పు ఉన్న రోడ్డు మార్గంలో స్థల ప్రభావం ప్రకారం వసతులు ఏర్పాటు చేయనున్నారు. వాహన పార్కింగ్, గ్రీనరీ, వెండింగ్ జోన్లు, పాదచారుల భద్రత, సైక్లింగ్ స్థానిక ప్రజల అవసరాలను వినియోగించుకునే విధంగా సర్వీస్ రోడ్డును కూడా ఏర్పాటు చేస్తారు.