Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ ఎర్రోళ్లకు నర్సుల వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పని చేసిన కాలానికి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు ఇప్పించాలని పలువురు నర్సులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ నర్సింగ్ సమితి (టీఎన్ఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు కె.గోవర్థన్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల సంస్థ చైర్మెన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 5,204 నర్సుల పోస్టులను భర్తీ చేస్తున్నట్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో ప్రభుత్వ వ్యవస్థలో పని చేసిన నర్సులకు అత్యధికంగా 20 మార్కుల వెయిటేజీ కల్పించారు. ఈ వెయిటేజీకి అర్హత పొందేందుకు వీలుగా ఉస్మానియా ఆస్పత్రిలో పని చేసిన నర్సులు సర్టిఫికెట్ల కోసం వెళితే అక్కడి మెడికల్ సూపరింటెండెంట్ తమకు సంబంధం లేదని వెనక్కి పంపించారు. ఇదే విషయంపై రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు (డీఎంఈ)ని కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో అంటే 2020 ఏప్రిల్ 28న ఉస్మానియా హాస్పిటల్లో స్టాఫ్ నర్సులుగా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమితులమై, 2021 జూన్ 7 వరకు విధులు నిర్వహించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా గోవర్థన్ మాట్లాడుతూ, ఉస్మానియాతో పాటు గాంధీ, నిలోఫర్ ఇతర ఏ ఆస్పత్రిలోనైనా సరే... అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేసిన నర్సులకు వెంటనే ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు.