Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటీకరణతో దేశాన్ని భ్రస్టుపట్టిస్తున్న మోడీ
- పీడీఎస్యూ పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నూతన విద్యావిధానం -2020 పేరుతో మతమౌఢ్యాన్ని ప్రవేశ పెట్టేందుకు మోడీ సర్కార్ కుట్ర చేస్తున్నదని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పీడీఎస్యూ పూర్వవిద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా 'వర్తమాన రాజకీయాలు- ప్రగతిశీల శక్తుల కర్తవ్యాలు' అనే అంశంపై కేంద్రీ య విశ్వ విద్యాలయం ప్రొఫె˜సర్ లక్ష్మీనారాయణ ప్రధానోపన్యాసం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలు చదువుకునే విద్యా సంస్థలను అభివృద్ధి చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయని చెప్పారు. బడ్జెట్లో నిధులు తగ్గించటమే దీనికి నిదర్శనమన్నారు. 1966లో నియమించిన డాక్టర్ కొఠారి కమిషన్ సూచించిన విధంగా కేంద్ర బడ్జెట్ లో 10శాతం , రాష్ట్ర బడ్జెట్లో 30శాతం నిధులు కేటాయించాలని సూచిస్తే... ఏనాడూ ఈ ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 30శాతం నిధులు కేటాయించాల్సి ఉండగా 6శాతం మాత్రమే కేటాయిస్తుందని చెప్పారు. పైకి మాత్రం కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం నంగనాచి మాటలు మాట్లాడుతున్నదని విమర్శించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విద్యా రంగా న్ని పూర్తిగా కాషాయీకరణ, కార్పొరేటికరణ విధానాలను ప్రవేశ పెట్టడానికి ప్రయత్నిస్తున్నదని చెప్పారు.మరో పక్క దేశంలో మనువాదాన్ని పెంచి పోషించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ గురు వారెడ్డి, డాక్టర్ కొండా నాగేశ్వర్, ధనుంజయ్, గీతా రామస్వామి, ప్రొఫెసర్ లక్ష్మీ ఈ సభకు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. పీడీఎస్యూ మొదటి రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ రావు, డాక్టర్ రంగారెడ్డి, మాజీ నేతలు సత్యనారాయణ, మేరెడ్డి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, అనిశెట్టి శంకర్, బూర్గుల ప్రదీప్, గొర్రెపాటి మాధవరావు వి. శంకర్, పి. ప్రసాద్, సాదినేని వెంకటేశ్వర్లు, అమర్, పోటు రంగారావులు మాట్లాడారు. పీడీఎస్యూ అధ్యక్షులు పరశ రాములు, మహేష్, ప్రధాన కార్యదర్శి అజాద్, విజృంభణ ప్రధాన కార్యదర్శి అల్లూరి విజరులు మాట్లాడారు. సభలో అరుణోదయ సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు విమలక్క, నాగన్న, కృష్ణ, వేణు పాల్గొన్నారు.