Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ రాజ్యాధికార సమితి కన్వీనర్ దాసు సురేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. మండల్ కమిషన్ సిఫార్సుల మేరకు దేశంలో బీసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో 27శాతం రిజర్వేషన్లు ఉన్నాయనీ, ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం తన మంత్రివర్గంలో బీసీలకు 27 శాతం మంత్రిత్వ శాఖలను కేటాయించిందని తెలిపారు. కానీ చట్టసభల్లో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అందే విధంగా బిల్లు ఎందుకు రూపొందించడం లేదని ప్రశ్నించారు. తక్షణం ఆ బిల్లుకు రూపకల్పన చేయాలని డిమాండ్ చేశారు.