Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కేంద్రమంత్రులు పర్యటించనున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా శనివారంవరంగల్ జిల్లాలో కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివద్ధి శాఖ సహాయ మంత్రి బీఎల్ వర్మ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పర్యటించారని తెలిపారు. ఆది, సోమవారాల్లో మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో బీజేపీ ి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గొట్టాల ఉమారాణి తదితరులు పాల్గొంటారని తెలిపారు. అలాగే ఈనెల 22, 23, 24 తేదీల్లో మెదక్ పార్లమెంటు పరిధిలో కేంద్ర ఫిషరీస్ పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాల పర్యటిస్తారు. 23, 24 తేదీల్లో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్ల్లాద్ జోషి చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పర్యటిస్తారని ఆపార్టీ కార్యాలయ కార్యదర్శి తెలిపారు.