Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సికింద్రాబాద్ - భువనేశ్వర్ - సికింద్రాబాద్ విశాఖ ఎక్స్‌ప్రెస్ (17016/17015)కు ప్రయాణీకుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నదని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైలులో కోచ్ కంపోసిషన్ మార్పు చేసి, ఎల్హెచ్బి కోచ్‌లను జతచేశామన్నారు. ఈ రైలు సర్వీస్ సేవలు ఈనెల 19నుంచి అందుబాటులోకి వచ్చాయని వివరించారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి ఇప్పటికే దాదాపు 60 శాతం రిజర్వేషన్ బుకింగ్ జరిగిందని చెప్పారు.
కోస్టల్ ఆంధ్ర, ఒరిస్సా వైపు ప్రయాణించే ప్రజలు ఈ రైలు ప్రయాణానికి ఎక్కువ ఆసక్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ రైలుకు పెరుగుతున్న ఆదరణపట్ల దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సంతప్తి వ్యక్తం చేశారని ఆ సంస్థ ముఖ్య ప్రజాసంబంధాల అధికారి సీహెచ్ రాకేష్ తెలిపారు.