Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగిసిన కేటీఆర్ దావోస్ పర్యటన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన విజయవంతమైంది. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొన్న ఆయన నాలుగు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వ విధానాలను, రాష్ట్రంలో పెట్టుబడులకున్న అనుకూల వాతావరణాన్ని, ప్రభుత్వ విధానాలను వివరించారు. ఫలితంగా రాష్ట్రంలో రూ.21 వేల కోట్ల మేర పెట్టుబడులను పెట్టేందుకు ప్రముఖ సంస్థలు ముందుకొచ్చాయి. తన పర్యటనను విజయవంతం చేసిన అధికారులకు మంత్రి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.ఆర్థిక సదస్సు వేదిక నేపథ్యంలో రూ.రెండు వేల కోట్లతో ఇండియాలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ డేటాసెంటర్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు భారతీ ఏయిర్ టెల్ గ్రూప్ ముందుకొచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా భారతీయ మార్కెట్లో తమ పెట్టుబడులను విస్తరిస్తామని ఫ్రాన్స్‌కు చెందిన ప్రఖ్యాత ఔషధ పరిశోధన, తయారీ సంస్థ యూరోఫిన్స్ తెలిపింది. లండన్ తర్వాత హైదరాబాద్‌లో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను అపోలో టైర్స్ ప్రారంభించనున్నది.. రూ.210 కోట్లతో అలాక్స్ అడ్వాన్స్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్. తెలంగాణలో మల్టీ గిగా వాట్ లిథియం క్యాథోడ్ మెటీరియల్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పనున్నది. రాష్ట్రంలో తమ కంపెనీ కార్యకలాపాలను రెట్టింపు చేస్తున్నట్టు పెప్సికో ప్రకటించింది. రీహాబిలిటేషన్ థెరపీలో రోగులు, వైద్య సంస్థలకు అవసరమయ్యే డిజిటల్ సేవలను అందించే వెబ్ పీటీ రూ. 150 కోట్లతో హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్‌తో సేవలందించనున్నది.