Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకానికి నిధులు వెంటనే విడుదల చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్ వెస్లీ, టి స్కైలాబ్‌బాబు శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. నిధులు కాగితాల్లోనే ఉన్నాయనీ, వాటిని అర్హులకు అందేలా నిర్ణయాలు జరగాలని డిమాండ్ చేశారు. అర్హులందరూ ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు.ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించి రాజకీయ జోక్యం లేకుండా ఆ పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని కోరారు. 2022- 23 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం రూ. 17,700 కోట్లు కేటాయించి పది నెలలు గడుస్తున్నా పది పైసలు కూడా విడుదల చేయలేదని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించినట్టుగా నియోజకవర్గానికి 1500 మందికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1500 నుంచి 500కు,200కు లబ్ధిదారుల సంఖ్యను తగ్గించిందని పేర్కొన్నారు. దీంతో అర్హులైన లబ్ధిదారులు దళిత బంధుకు నోచుకోవటం లేదని తెలిపారు.