Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతర్గత సామర్ధ్యం పెంచుకోవాలి
- 'డైరీ' ఆవిష్కరణలో టీఎస్జోన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ డీ ప్రభాకరరావు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదనీ, విద్యుత్ ఉద్యోగులు అంతర్గత సామర్థ్యాన్ని ఇంకా పెంచుకోవాలని టీఎస్జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు అన్నారు. సాంకేతిక వృద్ధి బాగున్నా, ఆర్థిక పరిస్థితి ఎందుకు మెరుగుపడట్లేదో చర్చ జరగాలని చెప్పారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళా భవన్లో తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2023 నూతన డైరీ, క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు. మీటర్ సేల్స్ పెంచడం, వధా ఖర్చులు తగ్గించుకోవడమే తమ ముందు కనిపిస్తున్నాయని చెప్పారు. విద్యుత్ సంస్థల అకౌంట్స్ అన్ని సక్రమంగా ఉన్నాయనీ, బ్యాలెన్స్ షీట్ ఇండెక్స్ ఆఫ్ ద కంపెనీ బాగున్నదని తెలిపారు. రూ. 37 వేల కోట్లు కరెంట్ ఉత్పత్తి, పంపిణీ కోసం కేటాయించామన్నారు. ట్రాన్స్‌కో, జెన్కోల పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా డిస్కంలు ఆర్థికంగా కుంగిపోతున్నాయని వివరించారు. సైబర్ క్రైమ్ పెరిగిందనీ, ఉద్యోగులు టెక్నాలజీ, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద పట్టు పెంచుకోవాలని సూచించారు. రూ. 40 వేల కోట్ల కాంట్రాక్టు బీహెచ్‌ఇఎల్‌కు ఇచ్చినప్పుడు తనపై చాలా ఒత్తిడి ఒచ్చిందని అన్నారు. ఉద్యోగుల పీఆర్సీపై సీఎం కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ సంస్థల్లోని ఉద్యోగ ఖాళీలను రాజ్యాంగ, న్యాయబద్ధంగా భర్తీ చేస్తామని వివరించారు. ట్రాన్స్‌కో జేఎమ్డీ శ్రీనివాసరావు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు పెట్టక తప్పదనీ, భవిష్యత్‌లో మీటర్ రీడింగ్ ఉండక పోవచ్చని చెప్పారు. విద్యుత్ సంస్థలకు రూ. 26 వేల కోట్ల సబ్సిడీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. గత ఏడాదిలో సంస్థకు రూ.600 కోట్ల నుంచి రూ.800 కోట్ల వరకు నష్టం వచ్చిందని వివరించారు. విద్యుత్ చట్టంలోని సెక్షన్ 176 ప్రకారం కొత్త నిబంధనలు రెగ్యులేటరీ కమిషన్‌కు వర్తిస్తాయనీ, అవి అమల్లోకి వస్తే విద్యుత్ సంస్థలపై ఆర్థిక భారం ఉండదన్నారు. కేంద్ర ప్రభుత్వం డిస్కంలను ప్రయివేటు పరం చేయాలని నిర్ణయించిందనీ, టెక్నాలజీని ఉపయోగించుకుని ముందుకు వెళ్తే ఆ ముప్పు ఉండదని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎమ్‌డీ అన్నమనేని గోపాల్‌రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎమ్‌డీ జీ రఘుమారెడ్డి తదితరులు మాట్లాడారు.