Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) హైదరాబాద్ చాప్టర్‌కు 2023 ఏడాదికి కొత్త ఆఫీస్ బేరర్లు ఎన్నికయ్యారని హైదరాబాద్ చాప్టర్ ఎగ్జిక్యూటివ్ అధికారి వి.శ్రీనివాస్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఛైర్‌పర్సన్‌గా సీఎస్ తంగిరాల లలితాదేవి, వైస్ ఛైర్‌పర్సన్‌గా సీఎస్ అక్షితా సురానా, కార్యదర్శిగా సీఎస్ మంజీత్ బుచా, ట్రెజరర్‌గా సీఎస్‌గా శ్రీలక్ష్మీ నారాయణ గుప్త నియమితు లయ్యారు. సీఎస్ ఎ.కార్తిక్, సీఎస్ పవన్ కంకాణి, సీఎస్ శిల్పా బంగ్ మేనేజింగ్ కమిటీ సభ్యులుగా ఎంపికకాగా, ఎక్స్అఫిషియో సభ్యులుగా రాజ వోలు వెంకట రమణ, మహ దేవ్ తిరునగరి ఎన్నికయ్యారు. భారత ప్రభుత్వ కార్పొరేట్ వ్యవ హారాల మంత్రిత్వ శాఖ పరిధిలో ఐసీఎస్ఐ పనిచేస్తుంది. కంపెనీ సెక్రటరీస్ (సీఎస్) కోర్సులోని విద్యార్థులకు ఉత్తమమైన, అత్యుత్త మ నాణ్యత విద్యపై హైదరాబాద్ చాప్టర్ సభ్యులు దృష్టి పెడతారు.