Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్‌యూపీపీటీఎస్ అధ్యక్షుడు జగదీశ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని భాషాపండితులకు న్యాయం చేయాలని కోరుతూ దశలవారీగా ఉద్యమం చేపడతామని ఆర్‌యూపీపీటీఎస్ అధ్యక్షుడు సి జగదీశ్ ప్రకటించారు. శనివారం హైదరాబాద్‌లో పండిత జేఏసీ నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు సమర్పించాలని చెప్పారు. సోమవారం అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, డీఈవోలకు వినతిపత్రాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేసే ఉపాధ్యాయుల పదోన్నతుల షెడ్యూల్‌కు ముందే పండితుల పదోన్నతులపై ఉన్న స్టేను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోర్టు తుది తీర్పునకు లోబడి భాషాపండితులకు పదోన్నతులు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్‌యూపీపీటీఎస్ ప్రధాన కార్యదర్శి ఎస్ నర్సిములు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఇజ్రాయెల్ పాల్గొన్నారు.