Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో.. వరంగల్ కేయూలో సంతకాల సేకరణ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ-హసన్పర్తి
2023-24 కేంద్ర బడ్జెట్లో విద్యకు 10 శాతం, వైద్యానికి 6 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ శనివారం వరంగల్ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో (కో-ఎడ్యుకేషన్) తెలంగాణ పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వేదిక రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం విద్యా వైద్యానికి ఐదేండ్లుగా బడ్జెట్ కేటాయింపులు తగ్గిస్తుందని, తద్వారా సామాన్య ప్రజలకు విద్య, వైద్యం అందకుండా పోతుందన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు పెట్టి విద్యార్థులపై ఫీజుల భారం పెంచుతున్నారు. కొఠారి కమిషన్ ప్రకారం కేంద్ర బడ్జెట్లో విద్యకు 10శాతం కేటాయిం చాల్సి ఉండగా.. గతేడాది 2.64 శాతం మాత్రమే కేటాయించారని తెలిపారు. వైద్యంలో పేరు గొప్ప ఊరు దిబ్బ లాగా ఆయుస్మాన్ భారత్ పథకమున్నదని, దానికి 2.1శాతం మాత్రమే నిధులు కేటాయించా రన్నారు. ఈ క్రమంలో చేపట్టిన సంతకాల సేకరణ ఆదివారమూ కొనసా గుతుందని, ఈ సంతకాల పత్రాలను సోమవారం ప్రధానికి కొరియర్ ద్వారా పంపిస్తామని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీధర్ కుమార్ లోధ్, డాక్టర్ గడ్డం కృష్ణ, ఆర్డీ ప్రసాద్, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ మధుకర్ రావు, డాక్టర్ బ్రహ్మయ్య, ఈ. రాజేశ్వరి, స్వప్న, తదితరులు పాల్గొన్నారు.