Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పర్యాటకుల కోసం మెగా ఆఫర్లు
- బుకింగ్‌లపై సిల్వర్ కాయిన్ గెలుచుకొనే అవకాశం, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు
నవతెలంగాణ-సిటీబ్యూరో
భారతదేశపు అగ్రశ్రేణి పర్యాటక, ఆతిథ్యరంగ సంస్థల్లో ఒకటైన సదరన్ ట్రావెల్స్.. అందరికీ అందుబాటు ధరల్లో ట్రావెల్స్ హాలిడే ఆఫర్లు ప్రకటించింది. 1970లో తొలిసారిగా న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఏర్పాటై భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖచే గుర్తించబడింది. దేశమంతటా తన బ్రాంచ్‌లను విస్తరించింది. తాజాగా అతి పెద్ద ఫ్లాష్ సేల్ 'హాలిడే మార్ట్'తో కస్టమర్ల ముందుకు వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కోల్కత్తా, ఛత్తీస్ గఢ్‌లో శనివారం హాలిడే మార్టులను ప్రారంభిం చింది. హైదరాబాద్‌లో సదరన్ హాలిడే మార్ట్‌ను సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ ప్రారం భించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలోని వివిధ నగరాల్లో ఈనెల 23వ తేదీ నుంచి సదరన్ ట్రావెల్స్ గ్రాండ్ హాలిడే రోడ్ షోలను నిర్వహిస్తుందన్నారు. ఈ హాలిడే మార్ట్‌లో దేశీయ, అంతర్జాతీయ టూర్లపై ఆఫర్లు, అతి పెద్ద డిస్కౌంట్లు అందిస్తున్నా మని చెప్పారు. టూర్ బుకింగ్‌లపై సిల్వర్ కాయిన్ గెలుచుకొనే అవకాశం, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, అంతర్జాతీయ హాలిడే టూర్ల బుకింగ్స్‌పై దేశీయ హాలిడే టూర్లను ఉచితంగా అందించడంతో పాటు లక్కీ డ్రాలపై ఎన్నో బహుమతులు కూడా అందిస్తామన్నారు. హాలీడే మార్ట్ ప్రదేశానికి వెళ్లలేని ఔత్సాహిక ప్రయాణికులు ఆన్లైన్లో స్లాట్స్ బుక్ చేసుకోవచ్చన్నారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణమోహన్ మాట్లాడారు. ప్రయాణికు లు ఇష్టమైన టూర్ ప్యాకేజీని ఎంచుకుని డిస్కౌంట్తోకూడిన తగ్గింపు ధరను చెల్లించొచ్చని తెలిపారు. టోకెన్ మొత్తం ధర రూ.5000 అని, దీన్నే బుకింగ్ మొత్తం గా పరిగణిస్తారని వివరించారు. టోకెన్ అమౌంట్ డిసెంబర్ వరకు బుక్ చేసుకుని ఏ టూర్లకైనా సర్దుబాటు చేసుకోవచ్చని చెప్పారు. ఈ సంవత్సరం సదరన్ ట్రావెల్స్.. దేశీయ, అంతర్జాతీయ గమ్య స్థానాలకు 440కి పైగా కస్టమైజ్డ్, గ్రూప్ ప్యాకేజీలను ప్రవేశపెట్టిందని తెలిపారు.
దేశ, విదేశీ టూర్ ప్యాకేజీలు
కస్టమర్లు యూరోప్, ఆఫ్రికా, స్కాండినేవియా, ఆస్ట్రేలియా, దక్షిణ ఆసియా, మధ్య తూర్పు, దుబారు, యూ.ఎస్.ఏ, కెనడా వంటి విదేశీ టూర్ ప్యాకేజీలతోపాటు భారతదేశంలోని నార్త్ ఇండియా నుంచి సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇండియాలో ఎక్కడికైనా టూర్ ప్యాకేజీలను బుక్ చేసుకోవచ్చునని మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ మోహన్ వివరించారు. ఈ హాలీడే మార్ట్‌తో దేశంలోని రాజస్థాన్, కేరళ, అండమాన్, చార్ధామ్, హిమాచల్‌ప్రదేశ్, కాశ్మీర్, నార్త్ ఈస్ట్, తమిళనాడు, గుజరాత్ వంటి ప్రధాన పర్యాటక స్థానాలన్నీ కవర్ చేస్తామని తెలిపారు. కస్టమర్లకు వారి బడ్జెట్లోనే కుటుంబంతో కలిసి ప్రయాణం, హనీమూన్, వెల్నెస్, సాహసోపేత టూర్లు, గ్రూప్ ప్రయాణాలు వంటి సౌలభ్యతలను మెగా హాలీడే మార్ట్ కస్టమర్లకు అందిస్తుందని వివరించారు.
సదరన్ ట్రావెల్స్ ఖ్యాతి
పర్యాటక, ఆతిథ్య రంగంలో 5 దశాబ్దాలపైగా సదరన్ ట్రావెల్స్ విశిష్టమైన సేవలు అందిస్తోంది. వ్యక్తిగత సెలవుల టూర్లు, నిర్ధిష్ట స్థిర ప్రయాణాలు, ప్రోత్సాహక సెలవుల టూర్లు, ప్రత్యేక ఆసక్తితో కూడిన టూర్లు, వీసాలు, హోటల్ బుకింగ్స్ అందజేస్తూ ఈ రంగంలో తనకు తానే సాటి అని నిరూపించుకుంది. కస్టమర్ల అవసరాలను బట్టి టూర్లను డిజైన్ చేసి అందించడంలో అగ్రశ్రేణి సంస్థగా సదరన్ ట్రావెల్స్ విలక్షణమైన ఖ్యాతిని సొంతం చేసుకుంది. న్యూఢిల్లీ, జైపూర్, విజయవాడ నగరాల్లో సదరన్ ట్రావెల్స్ సంస్థ 200కుపైగా రూమ్స్‌తో కూడిన హోటళ్లను కలిగి ఉంది. వారణాసిలోని కాశీ దేవాలయ ఆవరణలోని ప్రతిష్టాత్మకమైన 'భీమశంకర్ గెస్ట్ హౌస్' నిర్వహణకుగాను అవార్డు సొంతం చేసుకుంది. ఈ గెస్ట్ హౌస్‌ను ఇటీవల భారత ప్రధానమంత్రి ప్రారంభించారు. 'హాలీడే మార్ట్'కు సంబంధించిన వివరాల కొరకు 9848023236 నెంబర్‌ను సంప్రదించవచ్చు.