Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం విధానాలపై పోరాట కార్యాచరణ రూపకల్పన
- పలు తీర్మానాలకు మహాసభ ఆమోదం
- నాలుగు కమిషన్లపై ప్రతినిధుల చర్చ
- సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్
శ్యామల్ చక్రవర్తి నగర్ నుంచి అచ్చిన ప్రశాంత్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు ఈ నెల 30న ఢిల్లీలో కేంద్ర కార్మికుల సంఘాలన్నీ భేటీ అయి ఐక్యకార్యాచరణ రూపొందిస్తామని సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్య దర్శి తపన్‌సేన్ తెలిపారు.
బెంగుళూ రులోని శ్యామల్ చక్రవర్తినగర్(ప్యాలెస్ గ్రౌండ్)లోని మీడియా పాయింట్లో ఆయన విలే కర్లతో మాట్లాడారు. శని వారం నాడు మహాసభ ప్రతి నిధులు నాలుగు కమిషన్లుగా ఏర్పడి ఆధునిక ఉత్పాదక రంగంలో కార్మికులను సంఘటితం చేయడంలో ప్రాముఖ్యత, సవాళ్లు, భారతదేశంలో కార్మికుల అంతర్గత వలసలు, నయా ఉదారవాదం-కోవిడ్ సంక్షోభంలో ఇక్కట్లు, వ్యవస్థీకరణ సవాళ్లు, ఉపాధి విధానంలో వచ్చిన మార్పులు, కార్మికుల ఇక్కట్లు, కార్మికవర్గంపై మతోన్మాద ప్రభావం అనే అంశాలపై ప్రతినిధులు చర్చలు జరిపారని తెలిపారు. సుమారు రెండు వందల మందికిపైగా ఆ చర్చల్లో పాలుపంచుకున్నారన్నారు. ఇప్పటి వరకూ మూడు రోజుల పాటు జరిగిన మహాసభలో 58 మంది ఆయా రాష్ట్రాల, ఫెడరేషన్ల ప్రతినిధులు చర్చల్లో పాల్గొని నిర్మాణ పరమైన అంశాలపై లోతుగా చర్చించారనీ, విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారని చెప్పారు. వాటన్నింటినీ క్రోడీకరించుకుని భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటామని తెలిపారు.
యూఎస్ఏ, యూరప్, తదితర దేశాల్లో ప్రయివేటీకరించబడిన సంస్థలను తిగిరి ప్రభుత్వ రంగంలోకి మార్చాలని ప్రజలు పెద్దఎత్తున పోరా టాలు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. సోషలిస్టు ప్రభు త్వాలు ఏర్పడే చోట సామ్రాజ్య వాదం వాటిని కూల్చేసే ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. చైతన్యవంతమైన ప్రజలు సామ్రాజ్యవాద ఎత్తుగడలను తిప్పికొడుతున్నారని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇలాంటి వాటిని పరిగణనలోకి తీసుకోకుండా కార్పొరేట్లకు మేలు చేకూర్చేలాగా రైల్వే, ఇన్సూరెన్స్, విద్యుత్, ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణకు పూనుకుంటు న్నదని విమర్శించారు.
ఎన్‌ఎమ్‌పీ పేరుతో కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెడుతున్న తీరును వివరించారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటాలను ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. వ్యవసాయ రంగంలో తీసుకురావాలని చూసిన మూడు చట్టాలను రైతులంతా ఐక్యంగా పోరాడి తిప్పికొట్టారన్నారు. ఆ పోరాట స్ఫూర్తి తో ముందుకు సాగుతామని చెప్పారు. కేంద్రం విధానాల వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికుల పనివిధానంలోనూ తేడా వచ్చిందనీ, పర్మినెంట్ కార్మికుల స్థానాల్లో కాంట్రాక్టు, ట్రైనీ ఎంప్లాయి మెంట్ విధానం అమల్లోకి వచ్చిందని చెప్పారు. లేబర్ కోడ్ల రద్దు కోసం, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను అరికట్టాలనీ, పీడీఎస్ వ్యవస్థను బలోపేతం చేయాలనే డిమాండ్లపై ఐక్య పోరాటాలను రూపొందిస్తా మన్నారు. నయా ఉదారవాద విధానాలకు, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా సీరియస్‌గా పోరాటం చేస్తున్నదని చెప్పారు. కార్మిక, కర్షక, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏప్రిల్ ఐదో తేదీన ఢిల్లీలో మజ్దూర్కిసాన్ ఏక్తా మార్చ్ నిర్వహించబోతున్నట్టు తెలిపారు.
మహాసభలో పలు తీర్మానాలకు ఆమోదం
మహాసభ పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించిందని తపన్‌సేన్ తెలిపారు. ప్రపంచ కార్మిక పోరాటాలకు సంఘీ భావం, లేబర్ కోడ్ల రద్దు కోరుతూ, ఏప్రిల్ ఐదో తేదీన రైతు, వ్యవసాయ కార్మికులు, కార్మికుల సంయుక్త ర్యాలీ జయప్రదం, కర్నాటకలో కార్మికుల పోరాటాలకు సంఘీభావం, ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ దాడిని నిరసిస్తూ తీర్మానాలను ప్రవేశపెట్టినట్టు తెలిపారు. వీటితోపాటు పలు తీర్మానాలను కూడా ఆమోదించామని తెలిపారు.