Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, బి.బిక్షమయ్య
- రామగుండం కార్పొరేషన్లో సీపీఐ(ఎం) పాదయాత్ర
నవతెలంగాణ - గోదావరిఖని
అర్హులైన పేదలకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, బి.బిక్షమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లో శనివారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభించారు. రామగుండం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన ప్రారంభ సభకు సీపీఐ(ఎం) పెద్దపల్లి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.రామాచారి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏ నినాదం వెనుక ఎవరెవరి స్వార్థ ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకోనంత కాలం ప్రజలు మోస పోతూనే ఉంటారన్నారు. వ్లాదిమిర్ లెనిన్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయున్ని స్మరించుకొని, సీపీఐ(ఎం) బృందం పాదయాత్ర ప్రారంభించడం విప్లవ చైతన్యంతో కూడుకున్నదన్నారు. ఈ ప్రాంతంలో కనీస వేతనాల జీవోను గెజిట్ చేయించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. ఈ పాదయాత్ర ద్వారా ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుంటారన్నారు. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాగ్దానాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం రామగుండం ఏరియా అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సీపీఐ(ఎం) పెద్దపెల్లి జిల్లా కార్యదర్శి వై.యాకయ్య, కార్యదర్శివర్గ సభ్యులు వేల్పుల కుమారస్వామి, అనుముల మహేశ్వరి, జిల్లా కమిటీ సభ్యులు లావణ్య, నామని బిక్షపతికి పూలమాలవేసి పాదయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) ఎన్టీపీసీ రామగుండం ఏరియా కార్యదర్శి ఎం.రామాచారి, నాయకులు నాంసాని శంకర్, గిట్ల లక్ష్మారెడ్డి, తుంగ పిండి మల్లేష్, రవి, పైమద, లలిత, మెండె శ్రీనివాస్ ఎస్కే గౌస్, ఆరేపల్లి రాజమౌళి, ఇప్పలపల్లి సతీష్ కుమార్, కిషన్, రాధాకృష్ణ, రాయమల్లు, మద్దిడి ఎల్లయ్య, మార్త పోషం పాల్గొన్నారు.