Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డైరీ ఆవిష్కరణలో మంత్రి కొప్పుల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రయివేటు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులను ఆదుకుంటామని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. తెలంగాణ ప్రయివేటు ఉద్యోగుల సంఘం 2023 డైరీ, క్యాలెండర్‌ను ఆదివారం హైదరాబాద్‌లో మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రయివేటు ఉద్యోగులకు, కార్మికులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. కరెంట్ కష్టాలను తీరుస్తూ 24 గంటలు విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఇదేనన్నారు.కార్యక్రమంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంధం రాములు ఆంధ్రప్రదేశ్ కమిటీ ఇన్ఛార్జ్ మర్రపు గంగాధర్ రావు, ఐటీ వింగ్ అధ్యక్షులు కట్ట రవి కుమార్, ఎర్ర యాకయ్య, సంపత్ , మోహన్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.