Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రెండు రోజులపాటు జరగనున్న అటవీశాఖ ప్రాంతీయ స్థాయి క్రీడలు ఆదివారం హైదరాబాదులో ప్రారంభమయ్యాయి. వీటిని చార్మినార్ అటవీ సర్కిల్ సంరక్షణాధికారి బి.సైదులు ప్రారంభించారు. క్రీడా స్పూర్తిని కాపాడేందుకు కృషి చేస్తామని క్రీడాకారులు ప్రతిజ్ఞ చేశారు. చార్మినార్ అటవీ సర్కిల్ కు చెందిన మేడ్చల్, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాదు జిల్లాల అటవీ అధికారులు, ఉద్యోగులు, అటవీ అభివృద్ధి సంస్థ, అటవీ కళాశాల మరియు పరిశోధక సంస్థల అధికారులు, ఉద్యోగులు ఈ క్రీడల్లో పాల్గొంటున్నారు. పరుగు పందాలు, లాంగ్ జంప్, హై జంప్, డిస్కస్, జావెలిన్‌త్రో, క్రికెట్, ఫుట్ బాల్, వాలీబాల్, బాడ్మింటన్, టెన్నిస్, రైఫిల్ షటింగ్ మొదలగు అంశాలలో స్త్రీ, పురుషుల మరియు ఓపెన్, వెటరన్, సీనియర్ వెటరన్ విభాగాలలో పోటీలు నిర్వహించబడుతున్నాయి. రాష్ట్ర ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి (విజిలెన్స్),అటవీ అకాడమీ సంచాలకులు ఎలూ సింగ్ మేరు,అదనపు డైరెక్టర్ ఎస్. రమేశ్, జిల్లా అటవీ అధికారులు, రాహుల్ కిషన్ జాదవ్, జానకిరామ్, డి.వి.రెడ్డి, శ్రీధర్‌రావు, వెంకటేశ్వరరావు, అటవీ కళాశాల సంయుక్త సంచాలకులు, పి. శ్రీనివాసరావు ఇతర అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.