Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కొప్పులకు బాధితుల ఆవేదన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అనుచరుల భూ కబ్జాలపై విచారణ చేపట్టి, తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆదివారం మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను బాధితులు కోరారు. 2001లో కూకట్ పల్లి మండలం శంశి గూడ, ఎల్లమ్మబండ గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 57లో 200 మంది దళిత కుటుంబాలకు భూమి పట్టాలు నాటి ప్రభుత్వం ఇచ్చిందని గుర్తుచేశారు. ఆ భూములను ఈటల అనుచరులు, బంధువులు కబ్జాచేశారని తెలిపారు. తమకు న్యాయం చేయాలని బాధితులు మంత్రిని కోరారు. తమ భూములపై కన్నేసిన వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు.