Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారికోసం షీ టీమ్స్, భరోసా కేంద్రాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో మహిళల భద్రతకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్టు హౌంశాఖ తెలిపింది. వారికోసం ప్రత్యేకంగా షీ టీమ్స్, భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ఆదివారంనాడొక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ''దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రం కూడా మహిళల భద్రత ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయలేదు. భరోసా, లైంగిక నేరాలు, గహహింస, సైబర్ క్రైమ్ సహా అనేక విభాగాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈవ్ టీజింగ్, వివిధ రకాల వేధింపులు, సోషల్ మీడియా వేధింపులు మొదలైనవాటిని అరికట్టేందుకు షీ టీంలు విస్తతంగా పనిచేస్తున్నాయి. బాధితులకు తక్షణ పోలీసు సహాయం అందిస్తున్నాం. గతేడాది షీ టీంలకు 6,157 ఫిర్యాదులు అందాయి. అందులో 521 కేసులకు సంబందించి ఎఫ్ఐఆర్ లు నమోదు చేశాం. 1,206 పెట్టీ (సాధారణ) కేసులు నమోదయ్యాయి. 1,842 మంది కి కూడా కౌన్సిలింగ్ ఇచ్చాం'' అని వివరించారు. హైదరాబాద్, వికారాబాద్, వరంగల్, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేటలో భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. లైంగికదాడి, పోక్సో కేసులను రెండు నెలల్లో దర్యాప్తును పూర్తి చేసేందుకు ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశామనీ, 84 శాతం కేసులకు రెండు నెలల్లోపు ఛార్జ్‌షీట్ దాఖలు చేసినట్టు వివరించారు.