Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ జె. అజయకుమార్
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సల చేయించుకున్న రోగులకు, కుని ఆపరేషన్ చేయించుకున్నవారికి, బాలింతలకు ఇన్ఫెక్షన్ సోకకుండా శాస్త్రీయ పద్ధతిలో అన్ని విధాలుగా జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులకు తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ జె. అజయకుమార్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇటీవల ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో శస్త్రచికిత్స అనంతరం రోగులకు ఇన్ఫెక్షన్లు సోకిన నేపథ్యంలో ఆయన డీసీహెచ్ఎస్ డాక్టర్ సునీత, నాంపల్లి ఆస్పత్రి అధికారి డాక్టర్ సునీత, గోల్కొండ ఆస్పత్రి డాక్టర్ తస్లీమా మెహెర్ తదితరులతో కలిసి హైదరాబాద్‌లోని కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రి పరిసరాలను పరిశీలించారు. అనంతరం అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ జలజా వెరోనిక ఆర్ఎంఓ(సీఎస్) డాక్టర్ సాధన, ఆపరేషన్ థియేటర్ ఇన్చార్జి శేషుకుమార్, యూనస్, నర్సింగ్ సిబ్బందితో వారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి సోమవారం ఆస్పత్రిలోని ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీ సమావేశమై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించుకొని, పరిష్కరించుకోవాలని సూచించారు. అవసరమైతే నాంపల్లి ఆస్పత్రిని కొంతకాలం మూసివేసి, ఆధునికీకరణ పనులు చేపట్టాలని సూచించారు. ఇక్కడ రోగులకు ఇబ్బంది కలుగుతుందనుకుంటే వారికి ఖైరతాబాద్ ఆస్పత్రిలో సేవలందించాలన్నారు.