Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
క్యూబా విప్లవ వీరుడు చేగువేరా కుమార్తె అలైదా గువేరా,మనవరాలు ఎస్తేఫానియా గువేరా ఆధివారం హైదరాబాద్కు వచ్చారు.ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ విత్ క్యూబా(ఎన్సీఎస్సీ)-ఐప్సో, సీపీఎం, సీపీఐ,ప్రజాపంథా, న్యూడెమోక్రసీ, వివిధ ప్రజాసంఘాలు ఘనంగా స్వాగతం పలికాయి. స్వాగతం పలికిన వారిలో సీపీఐ(ఎం)కేంద్ర కమిటీ సభ్యులు ఆర్ ఆరుణ్కుమార్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నర్సింహారావు, జాన్ వెస్లీ, టి సాగర్, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాంనాయక్, సీపీఐ నాయకులు బాలమల్లేశ్, పశ్యపద్మ, ఆమ్ఆద్మీ నాయకులు డి సుధాకర్, ప్రజాపంథా రాష్ట్ర నాయకులు అన్మేశ్, ఎస్ఎల్ పద్మ, న్యూడెమోక్రసీ నాయకులు జేవీ చలపతిరావు, పీడీఎస్యూ అధ్యక్షులు మహేశ్ తదితరులు ఉన్నారు.