Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కె.హేమలత, తపన్‌సేన్
- కోశాధికారిగా ఎం.సాయిబాబు
- ఉపాధ్యక్షులుగా చుక్కరాములు, కార్యదర్శిగా పాలడుగు భాస్కర్,
- తెలంగాణ నుంచి వర్కింగ్ కమిటీలోకి ఐదుగురు
- జనరల్ కౌన్సిల్లోకి 14 మంది ఎన్నిక
శ్యామల్ చక్రవర్తి నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
సీఐటీయూ అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కె.హేమలత, తపన్‌సేన్, కోశాధికారిగా ఎం.సాయిబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బెంగుళూరులోని శ్యామల్ చక్రవర్తి నగర్‌లోని కామ్రేడ్ రంజనా నిరులా, రఘునాథ్‌సింగ్ వేదికగా కొనసాగుతున్న సీఐటీయూ అఖిల భారత 17వ మహాసభ ఆదివారం ముగిసింది. చివరి రోజు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఆఫీస్ బేరర్లుగా 39 మంది ఎన్నికయ్యారు. 125 మందితో వర్కింగ్ కమిటీ, 425 మందితో జనరల్ కౌన్సిల్ ఏర్పాటైంది. ఉపాధ్యక్షులుగా ఏకే పద్మనాభన్, ఎ.ఆనందన్, ఎ.సౌందరరాజన్, చుక్కరాములు, ఆర్.లక్ష్మయ్యతోపాటు 16 మంది ఉపాధ్యాక్షులుగా ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా, స్వదేశ్ దేవ్‌రారు, ఎలమారం కరీం, ఏఆర్.సింధు, పాలడుగు భాస్కర్, సీహెచ్.నర్సింగ్రావుతోపాటు 22 మంది కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. శాశ్వత ఆహ్వానితులుగా బసుదేవ్ ఆచార్య, జేఎస్.మజుందార్ హాజరుకానున్నారు.
తెలంగాణ నుంచి వర్కింగ్ కమిటీలోకి ఐదుగురు
తెలంగాణ నుంచి సీఐటీయూ వర్కింగ్ కమిటీలోకి ఐదుగురు ఎన్నికయ్యారు. వారిలో భూపాల్, జె.వెంకటేశ్, ఎస్వీ.రమ, పి.జయలక్ష్మి, కళ్యాణం వెంకటేశ్వర్లు ఉన్నారు. జనరల్ కౌన్సిల్ సభ్యులుగా తుమ్మల వీరారెడ్డి, జె.చంద్రశేఖర్, బీరం మల్లేశ్, పద్మశ్రీ, త్రివేణి, వీఎస్.రావు, ఆర్.కోటంరాజు, జె.మల్లిఖార్జున్, ఈశ్వర్రావు, వంగూరు రాములు, బి.మధు, తుమ్మల రాజిరెడ్డి, ఎ.నాగేశ్వర్రావు ఉన్నారు.