Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ-వెంకటాపూర్
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో వారసత్వ సంపదగా గుర్తింపుగాంచిన రామప్ప దేవాలయ అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం రామప్ప దేవాలయాన్ని మంత్రి సత్యవతి రాథోడ్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి ఆమె ఆలయాన్ని సందర్శించారు. వారికి ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికగా, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ అడగకుండానే ములుగు వాసులకు జిల్లా ప్రకటించారని, ఆదివాసీల సంక్షేమం కోసమే జిల్లా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇప్పటికే గిరిజన యూనివర్సిటీ కోసం 334 ఎకరాల భూ కేటాయింపు జరిగిందన్నారు. సమీకృత కలెక్టరేట్ కోసం 50 ఎకరాల స్థలం.కూడా కేటాయించినట్టు చెప్పారు. ఆసియాలో అతిపెద్ద గిరిజన మహా జాతర సమ్మక్క సారలమ్మలు కొలువు తీరడం జిల్లాకు గర్వకారణం అన్నారు. మేడారం జాతరకు జాతీయ హౌదాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. రూ. 1800 కోట్లతో సమ్మక్క బ్యారేజ్ నిర్మాణం జరిగిందన్నారు. గోదావరి పరివాహక కోత ప్రాంతాల్లో కరగట్టల నిర్మాణానికి రూ.130 కోట్ల నిధుల కేటాయించామని, జిల్లా ప్రజల ఆరోగ్యం కోసం హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టునూ ఇక్కడనుండే ప్రారంభించినట్టు తెలిపారు. ఆమె వెంట.. స్థానిక జెడ్పీ చైర్పర్సన్ కుసుమ జగదీష్, టీఎస్ రెడ్కో చైర్మెన్, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ ఏరువా సతీష్ రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మెన్లు వీరమల్ల ప్రకాష్, నాగుర్ల వెంకన్న, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, జాగృతి ములుగు జిల్లా అధ్యక్షులు కోరిక రవీందర్, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.