Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉన్నత విద్యామండలి చైర్మెన్కుఅందచేసిన జేఏసీ నేతలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరేషన్ చేయడంతోపాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీ ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్ లింబాంద్రికి సమ్మె నోటీసు ఇచ్చింది. ఆయనతోపాటు ఆయా యూనివర్సిటీల రిజిస్ట్రార్లకు కూడా సమ్మె నోటీసులు ఇచ్చామని జేఏసీ చైర్మెన్ డాక్టర్ ఎమ్ రామేశ్వరరావు, కన్వీనర్ డాక్టర్ శ్రీధర్‌కుమార్ లోధ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులందరికీ 30 శాతం వేతనాలు పెంచిందనీ, యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల వేతనాలు మాత్రం పెంచలేదన్నారు. అలాగే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి మొదటి వారంలోగా తమ డిమాండ్లను పరిష్కరించకుంటే 11 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు అందరూ సమ్మెకు దిగుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ విశ్వవిద్యాలయాలో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపక సంఘాల నాయకులు డాక్టర్ మంజు, హరీష్, జితేందర్, శ్రీనివాస్ రెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.