Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల కోసం నూతన హెల్త్ స్కీం రూపకల్పనకు ఆర్థిక, ఆరోగ్యశాఖల మంత్రి టీ హరీశ్‌రావు ఆదేశాలు ఇవ్వడాన్ని తెలంగాణ స్టేట్ ప్రోగ్రెసివ్ రికగ్నైజెడ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూ) స్వాగతించింది. ప్రభుత్వ ప్రకటన పట్ల యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీ శ్రీపాల్‌రెడ్డి, బీ కమలాకర్‌రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ హర్షం వ్యక్తం చేశారు. వేతన సవరణ కమిషన్ సూచించినట్టు ఉద్యోగులు మూలవేతనం నుంచి ఒక్క శాతం ప్రీమియం స్వీకరించి, స్కీం నిర్వహ ణకు అవసరమయ్యే అదనపు గ్రాంటును ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలి పారు. దీనివల్ల నగదు రహిత ఆరోగ్యసేవలు అందుబాటులోకి వస్తాయనీ, ఈ స్కీం నిర్వహణకు ప్రత్యేక ట్రస్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం, అలాగే కరువు భత్యం, ఉపాధ్యాయ బదిలీ, పదోన్నతుల షెడ్యూల్ విడుదలపై హర్షం వ్యక్తం చేశారు.