Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి టీపీటీయూ వినతి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులపై షెడ్యూల్ విడుదలకు సన్నద్ధం అవుతున్నందున తాము లేవనెత్తే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ (టీపీటీయూ) కోరింది. సోమవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మట్టపల్లి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి పటోళ్ల చంద్రశేఖర్, సంఘం వ్యవస్థాపకులు జీ వేణుగోపాలస్వామి తదితరులు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణకు వినతిపత్రం సమర్పించారు. జీవో 317 అప్పీళ్లన్నింటినీ పరిష్కరించి, జీరో సర్వీసును పరిగణలోకి తీసుకోవాలనీ, బ్లాక్ చేయబడిన 13 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలు చేపట్టాలంటూ 8 డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించినట్టు తెలిపారు.