Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ప్రత్యేక ప్రతినిధి
సంచలనం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కేసుకు సంబంధించి కడప వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని హైదరాబాద్‌లో సీబీఐ అధికారులు శనివారం విచారించారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు కోఠిలోని సీబీఐ కార్యాలయంలో ఆయనను సీబీఐ బృందం విచారించింది. దాదాపు నాలుగేండ్ల క్రితం కడప జిల్లా పులివెందుల లోని తన నివాసంలో వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే కొందరు నిందితులను సీబీఐ అరెస్టు చేసింది. అనంతరం ఈ కేసు దర్యాప్తును హైదరాబాద్‌కు మార్చిన సీబీఐ అధికారులు విచారణకు హాజరు కావాలంటూ అవినాశ్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. కాగా, శనివారం విచారణకు హాజరవు తానని తెలిపిన అవినాశ్‌రెడ్డి ఆ మాట మేరకు హైదరాబాద్‌లో సీబీఐ అధికారుల ఎదుట హాజరయ్యారు. కాగా, నాలుగు గంటల పాటు విచారిం చిన తర్వాత వెలుపలికి వచ్చిన అవినాశ్‌రెడ్డి తనకు సీబీఐ అధికారులు వేసిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చినట్టు తెలిపారు. ఈ కేసులో విచారణకు సంబంధించి తనను ఎప్పుడు పిలిచినా హాజరవుతానని సీబీఐ అధికారులకు తెలిపినట్టు అవినాశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.