Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.మధు
- రంగారెడ్డి జిల్లా కందుకూర్లో కొనసాగిన పాదయాత్ర
నవతెలంగాణ-కందుకూరు
గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్ర శనివారం రంగారెడ్డి జిల్లాలో కొనసాగింది. ఉదయం ఇబ్రహీం పట్నం మండలం ఎలిమినేడులో మొదలై కందు కూరు మండలం నుంచి మహేశ్వరం మండ లం తుమ్మాలూరు గ్రామానికి చేరుకుంది. కందు కూరు మండలంలోని మాదాపూర్, తిమ్మాపూర్, రాచులూ రు గ్రామాల్లో సభలు నిర్వహించారు.ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.26వేలు ఇవ్వాలన్నారు. జీవో నెంబర్ 51ని సవరించి, మల్టీపర్పస్ పని విధానాన్ని రద్దు చేయాలన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం అమలు చేయాలన్నారు. జీవో నెంబర్ 60 ప్రకారం పారిశుధ్య కార్మికులకు రూ.15600, కారోబార్, బిల్ కలెక్టర్లకు రూ. 19500, కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.22,750 వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనేక సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలో అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచకపోవడం సరైనది కాదన్నారు. పంచాయతీ కార్మికుల వల్లే పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమైందని చెప్పారు. పెరుగు తున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కారోబార్, బిల్ కలెక్టర్లకు స్పెష ల్ స్టేటస్ కల్పించాల న్నారు. గ్రామపంచాయతీ కార్మి కులకు దళితబంధు పథకం అమలు చేయాలన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి రూ.ఐదు లక్షలు ఇవ్వాలన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో గ్రామ పంచాయతీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గ్యార పాండు, రాష్ట్ర కార్యదర్శి చాగంటి వెంకటయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ గణపతిరెడ్డి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అలువాల రవికుమార్, మండల కన్వీనర్ బుట్టి బాలరాజు, సీపీఐ(ఎం) కార్యదర్శి బి.శ్రీనివాస్ ఏ.కుమార్ పి.జంగయ్య పాల్గొన్నారు.