Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదల సొమ్మును పెద్దలకు పంచుతున్న కేంద్రం
- దేశాన్ని ముక్కలు కాకుండా చూడాల్సిన బాధ్యత కమ్యూనిస్టులది
- ప్రజాసమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 23 నుంచి జాతాలు :
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ - గోదావరిఖని
మతోన్మాద, బడా పెట్టుబడిదారీ విధానాలను అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని రాబోవు ఎన్నికలలో గద్దెదింపుతామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఐ(ఎం) పెద్దపల్లి జిల్లా ప్లీనం సమావేశం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఏ.ముత్యంరావు, ఏ.మహేశ్వరి అధ్యక్షతన ఆదివారం గోదావరిఖని శ్రామిక భవన్లో నిర్వహిం చారు. ముందుగా జిల్లా కార్యదర్శి వై.యాకయ్య జెండావిష్కరణ చేశారు. అనంతరం తమ్మినేని వీరభద్రం మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నరేంద్రమోదీ నాయకత్వంలో మతోన్మాద, కార్పొరేట్ బడా పెట్టుబడిదారీ విధానాలను అతివేగంగా అమ ల ుచేస్తోందన్నారు. దేశ సంపదను అదాని, అంబానీ లాంటి వారికి కట్టబెడుతుందని విమర్శించారు. పేదల సొమ్మును పెట్టుబడి దారులకు అప్పగిస్తోం దన్నారు. లక్షల కోట్ల రూపాయలు సంపన్నులకు ఇస్తూ పేదలను దోపిడీ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరుకు మాత్రమే లక్షల కోట్ల రూపాయల బడ్జెట్.. అందులో పేదల అభివృద్ధి కోసం కేటాయింపులు లేవని అన్నారు. కొన్ని రంగాలకు కేటాయింపులు తగ్గించేసి ఆ రంగాలను నిర్వీర్యం చేసే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మతం పేరుతో హిందూ రాష్ట్రాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో హిందు, ముస్లిం, క్రిస్టియన్ల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతూ చీలికలు తెచ్చే విదంగా ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. పాకిస్థాన్, చైనా దేశాలను చూపించి ఇక్కడి ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రావడానికి బీజేపీ నాయ కులు ఎంత ఘోరానికైనా ఒడిగడుతారన్నారు. బీజేపీ, సంఫ్‌ు పరివార్ లక్ష్యం కేంద్రంలో అధికారం లోకి రావడం మాత్రమే కాదని దేశాన్ని హిందూ రాష్ట్రంగా నిర్మించాలనేది వారి కోరిక అని అన్నారు. ముస్లింలు, క్రిస్టియన్లు, కమ్యూనిస్టులనే బీజేపీ శత్రువులుగా భావించి తప్పుడు ప్రచారం చేస్తుస్తోందని చెప్పారు. దేశాన్ని ముక్కలు చేయడమే వారి ముఖ్య ఉద్దేశమన్నారు. అందుకే దేశాన్ని ముక్క లు కానివ్వకుండా చూడాల్సిన బాధ్యత కమ్యూని స్టులపై ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటీవల కాలంలో బీజేపీ తప్పుడు విధానాలను ఎండ గడుతూ ముందుకు వెళ్తుందని తెలిపారు. ఈ విధా నం ఇకపైనా కొనసాగాలని ఆకాంక్షించారు. అదేవి ధంగా రాష్ట్రంలో పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, డబుల్ బెడ్రూ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజాసమస్యలు పరిష్కరించాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 23 నుంచి జాతాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు భూపాల్ మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ మతోన్మాద, పెట్టుబడిదారీ విధానాలను అవలం బిస్తుంటే.. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శిం చారు. కనీస వేతనాల జీఓలు విడుదల చేయకుండా ప్రయివేటు కంపెనీల యజమానుల కొమ్ము కాస్తూ వారికి లాభాలు తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నా రన్నారు. కనీస వేతనాలు ఇవ్వాలని మార్చి 6న నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజ యవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాసం ఘాల ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇందులో కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి వై.యాకయ్య, కార్యదర్శివర్గ సభ్యులు వేల్పుల కుమారస్వామి, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, ఎం.రమాచారి పాల్గొన్నారు.