Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన సంఘం అధ్యక్షులు ఎం ధర్మానాయక్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రీతిని వేధించిన నిందుతున్ని కఠినంగా శిక్షించాలని తెలంగాణ గిరిజన సంఘం అధ్యక్షులు ఎం ధర్మానాయక్, గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ అంజయ్య నాయక్ డిమాండ్ చేశారు. ప్రీతి ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనీ, నిందుతుడిపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. ఆదివారం నిమ్స్ ఆస్పత్రిలో ప్రీతి కుటుంబాన్ని కలిశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల నుంచి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ప్రీతికి మెరుగైన వైద్యం అందించాలనీ, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. కాలేజీల్లో విద్యార్థులపై ర్యాగింగ్ చేసే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.