Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఒక న్యాయం, అదానీకి మరో న్యాయమా?అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిజాలు కాలక్రమంలో బయట పడతాయనీ, అందుకే సిసోడియా అరెస్టును తాము ఖండించడం లేదని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్థిక కుంభకోణాలతో దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలైన ఎల్ఐసీ, ఎస్బీఐ ఆదాయాన్ని అదానీ డొల్ల కంపెనీలకు మళ్లించుకుని వాటి నష్టాలకు కారణమయ్యారని విమర్శించారు. సుమారు రూ.13 లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడిన అదానీని అరెస్టు చేయరా?అని ప్రశ్నించారు. సీబీఐ, ఈడీ, ఐటీ, ఎన్ఐఏలు ప్రతిపక్ష సభ్యులను అరెస్టు చేయడానికే పరిమితమా?అని అడిగారు. ప్రతిపక్ష పార్టీల నాయకులే తప్పు చేస్తున్నారా?అని తెలిపారు. బీజేపీ నేతలు తప్పులకు అతీతులా?అని ప్రశ్నించారు. ఆమ్ ఆద్మీ పార్టీని బతకనివ్వరా?అని అడిగారు.