Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ సంఘం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశవ్యాప్తంగా జనగణనలో కులగణన కూడా చేపట్టాలనీ, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో తీర్మానించడం పట్ల బీసీ సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. ప్రయివేటు రంగంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామన్న ఆ పార్టీ నిర్ణ యాన్ని స్వాగతించింది. ఈ మేరకు సోమవారం ఆ సంఘం జాతీయ అధ్య క్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పదవుల్లో బడుగు, బల హీన వర్గాలకు 50 శాతం ఇస్తామనడాన్ని స్వాగతించారు. పార్టీ పదవులు, అసెంబ్లీ, పార్లమెంటు టికెట్లు ఇస్తామని హామీ ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీని చూసైనా... బీజేపీ కులగణన చేపట్టాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.