Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.65 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారి
నవతెలంగాణ- మంచిర్యాల
ఆగ్రో లైసెన్స్ కోసం లంచం తీసుకుంటూ మార్కెటింగ్ శాఖ కార్యదర్శి శారద అవినీతి నిరోధక శాఖ అధికారులకు సోమవారం పట్టుబడ్డారు. మంచిర్యాల జిల్లా కొనుగోలు శాఖ అధికారి కె.శారద, హనుమాన్ కాటన్ ఆగ్రో ఏజెన్సీ లైసెన్స్ కోసం విశ్వేశ్వర్ వద్ద నుంచి రూ.65వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్టు అవినీతి నిరోధకశాఖ డీఎస్పీ భద్రయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాటన్ ఆగ్రో ఏజెన్సీ లైసెన్స్ రెన్యువల్ కోసం విశ్వేశ్వర్ అనే స్థానిక వ్యాపారి దరఖాస్తు చేసుకోగా సదరు అధికారి రూ. ఒక లక్ష లంచం డిమాండ్ చేసింది. ఈ ఒప్పందం ప్రకారం బాధితుడు మొదటి దఫాగా రూ.15 వేలు ఆమెకి ఇచ్చాడు. అనంతరం వ్యాపారి ఏసీబీని ఆశ్రయించాడు. ఈ మేరకు వల పన్నిన ఏసీబీ అధికారులు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో వ్యాపారి నుంచి రెండో దఫాగా రూ.65వేల లంచం తీసుకుంటుండగా ఆమెను పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి కోర్టు రిమాండ్కు తరలించినట్టు డీఎస్పీ వివరించారు.