Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీజీవో ఇంటర్ విద్యాఫోరం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్ విద్యలో విద్యార్థుల జవాబు పత్రాలను ఆన్లైన్ మూల్యాంకనాన్ని స్వాగతిస్తున్నామని టీజీవో ఇంటర్ విద్యాఫోరం స్వాగతించింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్షులు ఎ వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇస్మాయిల్, అసోసియేట్ ప్రెసిడెంట్ వి ప్రవీన్‌కుమార్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అపోహలకు తావ ులేకుండా ఆన్లైన్ మూల్యాంకనం చేపట్టాలని నిర్ణయించడం శుభపరిణామమని తెలిపారు. ఈ పరిస్థితుల్లో సస్పెండైన, జీజేఎల్ఏ నాయకుడు అపోహలు సృష్టించడం వల్ల ఎవరికి మేలు కలుగుతుందని ప్రశ్నించారు.