Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం....
- మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్
నవతెలంగాణ-దేవరుప్పుల
వైద్య విద్యార్థి ప్రీతి నాయక్ కు జరిగిన ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించా మని పోలీసులు చాకచక్యంగా కేసును ఛేదిస్తున్నారని గతంలో ఉన్న ఘటనలో ఉన్న ఏ ఒక్కరిని వదిలేయలేదని ప్రీతి తల్లిదండ్రులకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్లు హామీ ఇచ్చారు. సోమవారం సాయంత్రం జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్ని తండాలో వారి స్వగృహానికి వచ్చి తల్లిదండ్రులను పరామర్శించారు. ప్రీతి నాయక్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున పది లక్షలు, పార్టీ తరపున మరో 10 లక్షలు, వ్యక్తిగతంగా మరింత ఆర్థిక సాయం చేస్తామని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ప్రీతి తండ్రి డబ్బులు అడగలేదని మా ఆత్మ సంతృప్తి కోసం ఇస్తున్నామని అన్నారు. వారు కోరుకుందల్లా నిందితులను శిక్షించాలని అడిగారు. పోలీసులు ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
రాజకీయం చేసేవారు దయచేసి సహకరించాలని కేంద్ర ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం, ఉద్యోగమిస్తే మేము స్వాగతిస్తాం అన్నారు. ఆడబిడ్డపై రాజకీయం చేయవద్దని దయాకర్ రావు అన్నారు. మరో ఏ ఆడబిడ్డకు ఇలా పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలను తీసుకుంటున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. వీరితోపాటు మహబూబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఉన్నారు.