Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైర్మెన్, వైస్ చైర్మెన్‌ను సస్పెండ్ చేయాలి
- పీఏసీఎస్ డైరెక్టర్ కొంగర జనార్ధన్‌రెడ్డి
నవతెలంగాణ-మంచాల
రంగారెడ్డి జిల్లా మంచాల పీఏసీఎస్‌లో రూ. 51 లక్షలు అవినీతికి పాల్పడిన చైర్మెన్, వైస్ చైర్మెన్లను సస్పెండ్ చేసి, అవినీతి సొమ్మును వెంటనే రికవరీ చేయాలని పీఏసీఎస్ డైరక్టర్ కొంగర జనార్ధన్ రెడ్డి సంబంధిత అధికారులను కోరారు. సోమవారం మండలంలోని ఆరుట్ల గ్రామంలో ఆయన మాట్లాడుతూ.. సొసైటీ చైర్మెన్‌గా ఎన్నికై మూడేండ్లు గడిచినా, ఏ ఒక్క రైతుకు కూడా ఎల్టీ లోన్ ఇవ్వలేదన్నారు. కానీ ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను అమ్ముకుందామని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు వెళ్తే, తూకంలో మోసం చేసి రూ. 51 లక్షలు ముంచారని విమర్శించారు.
ప్రధాన మంత్రి పసల్ బీమా డబ్బులు కూడా రైతులకు ఇవ్వడం లేదన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చైర్మెన్, వైస్ చైర్మెన్లను వెంటనే సస్పెండ్ చేసి, అవినీతి సొమ్మును రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.