Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎకరానికి ఆరు క్వింటాళ్లే కొంటామని కొర్రీపై రైతుల ఆందోళన
నవతెలంగాణ-కోటగిరి
ఎకరానికి ఆరు క్వింటాళ్ల శనగలే కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగిలిన పంటను ఎవరికి విక్రయించుకోవాలని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి కోటగిరి మండలంలోని హెగ్డోలిలో సోమవారం శనగ రైతులు కొనుగోలు కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. శనగ పంట ఎకరాకు 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని, మిగిలిన పంట ఎవరికి అమ్ముకోవాలని ప్రశ్నించారు. దిగుబడి వచ్చినంత మేర కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా కౌలు రైతులు విక్రయించిన శనగ పంట డబ్బులు కౌలు రైతుల ఖాతాల్లోనే జమచేయాలని కోరారు. యజమానులు వేరే దేశాల్లో ఉండటంతో తమకు డబ్బులు సకాలంలో అందడం లేదని తెలిపారు. దీనికి తోడు పంట నమోదులో అధికారుల తప్పిదంతో రైతులు నష్టపోతున్నారని వాపోయారు. శనగ పంట సాగు చేస్తే ఆన్లైన్లో వరి పంట సాగు చేస్తున్నట్టు నమోదు చేయడంతో శనగ పంటను కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు స్పందిస్తూ.. ఉన్నతాధికారులకు నివేదిస్తామని, రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ జట్పీటీసీ శంకర్, రైతులు పాల్గొన్నారు.