Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధ్యాయులు, అధ్యాపకులకు టీఎస్‌యూటీఎఫ్ పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్యారంగ అభివృద్ధి, ఉపాధ్యాయులు, అధ్యాపకుల సంక్షేమం కోసం ఎమ్మెల్సీగా పాపన్నగారి మాణిక్‌రెడ్డిని గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్ కిష్టయ్య బృందం జడ్చర్ల, మిడ్జిల్, మహబూబ్‌నగర్ ప్రాంతంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కాలేజీలతోపాటు కేజీబీవీల్లో సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారని తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ మైనార్టీ గురుకులాలు, నాగర్‌కర్నూల్ జిల్లాలోని వివిధ పాఠశాలలను తాము సందర్శించి విద్యారంగ అభివృద్ధి, ఉపాధ్యాయులు, అధ్యాపకుల సంక్షేమం కోసం తమ సంఘం బలపరిచిన మాణిక్‌రెడ్డిని గెలిపించాలని కోరామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి మాణిక్‌రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని వివిధ పాఠశాలలను సందర్శించి పండితులు, పీఈటీల పదోన్నతులు, బదిలీల వంటి సమస్యల పరిష్కారానికి తనకు మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని కోరారు.