Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-పరకాల/ నడికుడ
బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అంటే ఏమిటో రాబోయే ఎన్నికల్లో తడాఖా చూపిస్తామని రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం పరకాల నియోజకవర్గంలోని నడికుడ మండలం కంఠాత్మకూరు గ్రామం నుండి జోడోయాత్ర ప్రారంభమై నడికుడ, పులిగిల్ల, రాయపర్తి, మలకపేట గ్రామాల మీదుగా మలక్‌పేటకు చేరుకున్నారు. ఆంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ జన జనసంద్రంతో ర్యాలీగా వచ్చి బస్టాండ్ సెంటర్లో రోడ్ షోలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పరకాల నియోజకవర్గం ఇన్ఛార్జీ ఇనుగాల వెంకటరామిరెడ్డి అధ్యక్షతన సభ జరగగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పోకడ రజాకార్ల పోకడను తలపిస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని, నాయకులను అణగదొక్కే ధోరణిలో వ్యవహరించడం తెలంగాణ ప్రజలు సహించరన్నారు. దళితులకు ఇస్తానన్న ఏ ఒక్క హామీని నేటికి నెరవేర్చకపోవడం దళిత అభివృద్ధికి అడ్డు మరేది లేదని అన్నారు. దళితులే సీఎం కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలని అన్నారు. హైదరాబాదులో ఐటీ, ఉచిత ఆరోగ్యశ్రీ నిరుపేదలకు ఫీజు రీయింబర్స్మెంట్, ప్రతి ఊర్లో గుడి, బడి ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. పరకాల నియోజకవర్గం పోరాటాల గడ్డకు అడ్డా అని ఆ అడ్డాను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచరులతో కాంట్రాక్టర్ల బినామీ పేర్లతో వేల కోట్లకు పడగలెత్తుతూ అందినంత దోచుకోవడమే తన నైజంగా పరకాలను అడ్డగా మార్చుకున్నాడని అన్నారు. పరకాలలో ఇక చల్లా ధర్మారెడ్డి పాలన ముగిసిందన్నారు. రాష్ట్రంలో మరో రజాకారుల పాలనను తపిస్తుందని రాబోయే 2024 ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పి కాంగ్రెస్ సోనియా రాజ్యాన్ని తీసుకొచ్చేలా ప్రజలు గెలిపించాలని వేడుకొన్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీలు అంజన్ కుమార్‌యాదవ్, సిరిసిల్ల రాజయ్య, నియోజకవర్గ ఇన్ఛార్జీ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, ప్రభుత్వ తీరుపై విమర్శించారు. రేవంత్ రెడ్డికి భారీ సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ మండల నాయకులు కటకూరి దేవేందర్ రెడ్డి, స్రవంతి, కొయ్యడ శ్రీనివాస, రూపా చందర్, బుర్ర దేవేందర్ గౌడ్, పంచగిరి జయమ్మ, సుమన్, పాల్గొన్నారు.