Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, నవతెలంగాణ సీజీఎం ప్రభాకర్
నవతెలంగాణ-హుజూర్నగర్రూరల్
నవతెలంగాణ దినపత్రిక రాష్ట్ర బ్యూరో చీఫ్ బీవీఎన్.పద్మరాజు తండ్రి బొల్లేపల్లి పెద్దవెంకటరాజు(66) ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందారు. సోమవారం వెంకట రాజు అంత్యక్రియలు ఆయన స్వగ్రా మం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం శ్రీనివాసపురం గ్రామంలో నిర్వహించారు. ఈ సంద ర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, నవతెలంగాణ సీజీఎం ప్రభాకర్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వెంకటరాజు ఈ ప్రాంతంలో జరిగిన ప్రజా పోరాటాల్లో పాల్గొన్నారన్నారు. ఈ ప్రాంతంలో పార్టీ విస్తరణకు కృషి చేయడంతో పాటు ఈ ప్రాంతంలో పలువురిని ప్రజా ప్రతినిధులుగా గెలిపించుకో వడంలో ఆయన కృషి మరువలే నిదన్నారు. నివాళులర్పించిన వారి లో.. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.బసవపున్నయ్య, మఫిషి యల్ ఇన్చార్జి వేణుమాధవ్, బ్యూరో రిపోర్టర్లు వెంకన్న, జగదీశ్, హరి, జిల్లా రీజినల్ మేనేజర్ పి.మట్టయ్య, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గస భ్యులు నాగారపు పాండు, జిల్లా కమిటీ సభ్యులు పల్లె వెంకటరెడ్డి, దుగ్గి బ్రహ్మం, వట్టెపు సైదులు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్, గ్రామశాఖ కార్యదర్శి మడూరి నర్సింహాచారి, మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.