Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేబర్ కోడ్ల రద్దు కోసం పోరాడుతాం : ఎం.సాయిబాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, భవన నిర్మాణ కార్మికుల 1996 కేంద్ర చట్టం, 1979 అంతర్ రాష్ట్ర వలస కార్మికుల చట్టాల రక్షణ కోసం దేశవ్యాప్తంగా ఐక్య ఉద్యమం చేస్తామని సీడబ్ల్యూఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు చెప్పారు. సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్రస్థాయి వర్క్షాపు హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు యస్. రామ్మోహన్ అధ్యక్షతన జరిగింది. సాయిబాబు మాట్లాడుతూ దేశ స్వాతంత్రానికి ముందు, ఆ తర్వాత కార్మికవర్గం తమ రక్తాన్ని చిందించి పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను నాలుగు కోడ్లతో బీజేపీ ప్రభుత్వం కాలరాస్తున్నదని విమర్శించారు. దీనివల్ల భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ పథకాలకు దూరమయ్యే ప్రమాదముందన్నారు. ఈ విధానాలపై కార్మికవర్గం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఫెడరేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వంగూరు రాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. కోటంరాజు, ఉపాధ్యక్షులు డి.లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.