Authorization
Mon April 28, 2025 02:28:37 pm
నవతెలంగాణ-సూర్యాపేట
ఉచిత ఆర్థోపెడిక్ ఆపరేషన్ క్యాంపు నిర్వహించడం అభినందనీయమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ పుల్లారావు అన్నారు. మల్లు స్వరాజ్యం ప్రథమ వర్ధంతి సందర్భంగా ఎంవీఎన్ ట్రస్టు ఆధ్వర్యంలో ఐఎంఏ, లయన్స్ క్లబ్ సహకారంతో బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక భీమిడి రమేశ్‌రెడ్డి ఆర్థోపెటిక్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఆర్థోపెటిక్ మోకాలు లిగమెంట్ ఉచిత ఆపరేషన్ క్యాంపును ఆయన ప్రారంభించి మాట్లాడా రు. జిల్లాలో ఉచిత ఆర్థోపెడిక్ మెడికల్ క్యాంపు నిర్వహించడం ఎంతో సంతోషకర మైన విషయమన్నారు. ఇలాంటి క్యాంపుల కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.