Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వింటా మిర్చి రూ.25,550
- వేలం జెండా పట్టిన మంత్రి పువ్వాడ
- ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రికార్డు స్థాయి ధర
నవతెలంగాణ-ఖమ్మం కార్పొరేషన్
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజ రకం కొత్త మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలికింది. ఖమ్మం మార్కెట్ చరిత్రలో అత్యధికంగా క్వింటా మిర్చికి ధర రూ. 25,550 పలకడం ఇదే ప్రథమం. ఖమ్మం మార్కెట్‌ను అంతర్జాతీయ మార్కెట్‌కు చిరునా మాగా తీర్చిదిద్దుతామని చిల్లీస్‌కు హబ్‌గా చేస్తామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ అన్నారు. సోమవారం ఖమ్మం వ్యవసాయ మిర్చి మార్కెట్లో నిర్వహించిన వేలం పాటలో మంత్రి పాల్గొని జెండా పట్టి ధర నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంలో ఖమ్మం మిర్చి మార్కెట్లో రికార్డు స్థాయిలో మిర్చికి ధర పలికిందని తెలిపారు. కొన్ని క్వింటాలే కాదు.. రైతులు పండించిన ప్రతి బస్తాలను కొనుగోలు చేస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం లాభసాటిగా మారిందని, మనం పండించే మిర్చికి అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉందని చెప్పారు. చైనా మిర్చి కంపెనీలు ఖమ్మం మార్కెట్లో మిర్చిని కొనుగోలు చేస్తోందని, దాంతో చైనాకి క్వాలిటీ మిర్చి ఎగుమతి చేస్తున్నామన్నారు. మిర్చి ఘటు కంటే రైతుల మీద ప్రేమ ఎక్కువ అని, అందుకే రైతుల ప్రయోజనాలు ముఖ్యమని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ దోరేపల్లి శ్వేత, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి రుద్రాక్షి మల్లేశం, వైస్ చైర్మెన్ షేక్. అఫ్టల్, మార్కెట్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.