Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ విద్వేషపూరిత విధానాలతో దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లుతున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా ఆందోళన వ్యక్తం చేసారు. సోమవారం హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్లో అఖిల భారత తంజీమ్ ఏ ఇన్సాఫ్ సమావేశాన్ని ఎండీ.ఫయాజ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా అజీజ్‌పాషా మాట్లాడుతూ దళితులు, ఆదివాసీలు, మైనారిటీలపై హింసకు కారణం బీజేపీ దాని అనుబంధ సంఫ్‌ు పరివార్ శక్తులేనని తెలిపారు. మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ పాలిత ప్రభుత్వాలు వివక్షాపూరిత చట్టాలు తెస్తున్నాయన్నారు. దాడులు, బెదిరింపులు, హింస, ఆస్తులను బలవంతంగా స్వాధీనం చేసుకోవడంలాంటి చర్యలకు పాల్పడడం దుర్మార్గమని విమర్శించారు. కూనంనేని సాంబశివ రావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలోని మైనారిటీలపై ద్వేషపూరిత నేరాల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసారు. కార్యక్రమంలో ఇన్సాఫ్ రాష్ట్ర నాయకులూ సలాం, ఎండీ. జలలొద్దీన్, మునీర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.