Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓయూ విశ్వవిద్యాలయం ప్రభుత్వానిదా లేక ప్రైవేటుదా?: ఐవైఎఫ్ రాష్ట్ర సమితి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ ఎంట్రన్స్‌లో ఉతీర్ణత సాధించి ఇంటర్వ్యూ ద్వారా ఎంపికైన విద్యార్థుల కోర్సు ఫీజును రూ.2 వేల నుంచి రూ.25 వేలకు పెంచడం పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్రలో భాగమేనని అఖిల భారత యువజన సమాఖ్య (ఏ ఐ వై ఎఫ్) రాష్ట్ర సమితి విమర్శించింది. ఈ మేరకు సోమవారం ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలీ ఉల్లా ఖాద్రీ,ప్రధాన కార్యదర్శి కె. ధర్మేంద్ర ఒక ప్రకటన విడుదల చేశారు. తక్షణమే పెంచిన పీహెచ్డీ అడ్మిషన్ ఫీజును తగ్గించాలని డిమాండ్ చేశారు.