Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 31లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో(టీఎస్ఆర్జేసీ) 2023-24 విద్యాసంవత్సరంలో ప్రవేశం కోసం దరఖాస్తులకు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆహ్వానం పలికింది. సోమవా రం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది ఏప్రిల్లో పదో తరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 31 లోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని స్పష్టం చేసింది. మిగతా వివరాల కోసంhttp://tsrjdc.cgg.gov.in సంప్రదించాలని సూచించింది.