Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వ లక్ష్యాలను అధికారులు సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. సోమవారం హైదరాబాద్లోని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో డిడబ్ల్యుఓ అధికారులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మహిళల అభివృద్ధి శిశు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం భావించి, ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా వారి ఆరోగ్యం కోసం అంగన్ వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు, బాలింతలకు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తుందన్నారు. మాతాశిశు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ అందిస్తుందని, బిడ్డకు జన్మనిచ్చాక కేసీఆర్ కిట్ వంటి భారీ పథకాలను అమలు చేస్తున్నదని చెప్పారు.ఈ పథకాల అమలుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులకు మంత్రి సూచించారు.