Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ అధినేత రాకకై మరాఠీల ఎదురు చూపులు
- పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలిచి దేశానికి దిక్సూచిగా మారిన తెలంగాణ మోడల్‌ను సంపూర్ణంగా అర్థం చేసుకున్న మహారాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జై కొడుతున్నారని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. మహారాష్ట్ర లోని కాందార్ లోహలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ రాక కోసం మరాఠీలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. కాందార్ లోహ సభ ద్వారా తెలంగాణ మోడల్ ఆవిష్కృతమవుతుందని ఆయన పేర్కొన్నారు. ''అనితర సాధ్యమైన అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తెలంగాణ మోడల్. కేసీఆర్‌ది దేశానికి అన్నం పెట్టే మోడల్.మోడీది అన్నం పెట్టిన వారికే సున్నం పెట్టే మోడల్. కేసీఆర్ అంటే ఒక నమ్మకం.. మోడీ అంటే ఒక అమ్మకం. కేసీఆర్‌ది ఇండియా యిజం. మోడీది ఈడీయిజం.బీజేపీ ఒక సెల్లర్ పార్టీ.కిసాన్ కిల్లర్ పార్టీ. బీఆర్ఎస్ది రాజనీతి. బీజేపీది దమన నీతి. కాందార్ లోహ సభ సక్సెస్‌తో మోడీ దిమ్మతిరుగుతుంది...'' అని జీవన్ రెడ్డి హెచ్చరించారు. అందరికీ అన్నం పెట్టే కేసీఆర్ మోడల్ కావాలా ?.దేశ ప్రజలకు సున్నం పెడుతున్న మోడీ గోల్ మాల్ మోడల్ కావాలో? దేశ ప్రజలు చర్చంచి తేల్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.