Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు శోభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది రైతులు, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చాలని ఆకాంక్షించారు. సాగునీరు, తాగునీరు, పచ్చని పంటలతో రాష్ట్రంలో నిత్య వసంతం నెలకొన్నదని పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా దాని అనుబంధ రంగాలు, వృత్తులు బలపడి తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైందని వివరించారు. రాష్ట్రం సాధించిన ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. శోభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్రంతోపాటు భారతదేశం మరింత గొప్పగా అభివృద్ధి సాధించాలని కోరారు. ఉగాది సందర్భంగా అన్ని వర్గాల ప్రజల్లో శాంతి, సౌభ్రాతృత్వం, సామరస్యం, ఆరోగ్యం, ఆనందం ఉండాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పి సబితా ఇంద్రారెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు, రాష్ట్ర పోలిసు హౌజింగ్ కార్పొరేషన్ చైర్మెన్ కోలేటి దామోదర్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.